సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన గీతకార్మికుడు వీరగోని బక్కయ్య(49) గురువారం తాటిచెట్టు పైనుంచి ప డి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. బక్కయ్య రోజువారీ కార్యక్రమంలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారడంతో కిందపడ్డాడు. తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అ ప్పటికే మృతి చెందినట్లు తెలి పారు. మృతుడి భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బక్కయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని సర్పంచ్ ఓగుల పూజ, గౌడ సంఘం అధ్యక్షుడు పోచమల్లు కోరారు.


