కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో సూత్రధారి, అంతర్ రాష్ట్ర గ్యాంగ్ హ్యాండ్లర్, ‘ది గోల్డెన్ థీప్’ సుభోద్‌సింగ్‌ను కరీంనగ ర్ పోలీసులు గురువారం రాత్రి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చినట్లు సమాచారం. బిహార్ జైలులో ఖైదీగా ఉన్న సుభోద్‌సింగ్‌ను పీటీ వారెంట్‌పై కరీంనగర్ కోర్టుకు తరలించి, కస్టడీ తీసుకునేందుకు సిద్ధమైన్లు తెలిసింది. నగరంలోని పీఎంజే జువెల్లరీస్‌లో దోపిడీకీ మూడు నెలల నుంచి రెక్కీ నిర్వహించిన సుభోధ్‌సింగ్ ముఠాకు చెందిన నలుగురు సభ్యులు పక్కాగా ప్లాన్ వేసి ధర్మపురి లాడ్జీలో మకాం వేశారు. అంతకంటే ముందు మహరాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి తుపాకులు తీసుకొచ్చి ధర్మపురిలో పెట్టుకున్నారు. అక్కడి నుండి వచ్చి కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీస్‌లో ఈ నెల 3వ తేదీన ఉదయం 11 గంటలకు రూ.82.02 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేశారు. జువెల్లరీస్ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం బైక్‌లపై పలు గ్రామాల గుండా కాలువలు, గ్రామీణ రోడ్ల మీదుగా ధర్మపురికి చేరుకున్నారు. అక్కడి నుంచి గోదావరి నది దాటి మంచిర్యాల మీదుగా రైలులో పరారయ్యాయు. అక్కడి నుంచి పారిపోయి ముఠా సభ్యులకు బంగారం చేరవేశారు. వారు దానిని నేపాల్ తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. బృందాలుగా ఏర్పడిన కరీంనగర్ పోలీసులు బిహార్, పశ్చిమబెంగాల్‌తో పాటు వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు, సిబ్బంది సాయంతో నిందితులు బెంగాల్‌కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగిరాసింగ్, బిహార్‌కు చెందిన రావిష్‌కుమార్ అలియాస్ ప్రద్యుమన్, నిందితులకు సిమ్‌కార్డులు సరఫరా చేసిన బెంగాల్‌కు చెందిన మెహతాబ్‌ఖాన్ అలియాస్ మహబూబ్‌ఖాన్‌లను గుర్తించి ఈనెల 14న అరెస్టు చేసి కరీంనగర్ తీసుకొచ్చారు. ఈ దోపిడీ కేసులో కీలక సూత్రధారి అయిన సుభోద్‌సింగ్‌తో పాటు మిగితా నిందితులు పరారీలో ఉండగా, బిహార్ జైళ్లో ఉన్న సుభోద్‌సింగ్‌ను పీటీ వారెంట్‌పై కరీంనగర్ పోలీసులు తీసుకొచ్చినట్లు తెలిసింది. కోర్టు అనుమతిస్తే కస్టడీకీ తీసుకొని దోపిడీ సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు.
పీటీ వారెంట్‌పై బిహార్ జైలు నుంచి ‘పీఎంజే’ దోపిడీ సూత్రధారి తరలింపు


