వేసవిలో ఇంటి వద్దే ఉంటూ ఉదయం, సాయంత్రం డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. – పొందుర్తి భువన్
ఎండాకాలం సెలవుల్లో ఎండల్లో తిరగకుండా సరదాగా డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. నిత్యం డ్యాన్స్‌లో శిక్షణ తీసుకోవడం సంతోషంగా ఉంది.
– వర్షిణి
సెలవుల్లో సెల్‌ఫోన్లు చూసేందుకు కూడా టైం దొరకడం లేదు. ఉదయం, సాయంత్రం డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. ఇది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది మమ్మల్ని అభినందిస్తున్నారు . – నేహాశ్రీ


