రవాణాపై భారం | - | Sakshi
Sakshi News home page

రవాణాపై భారం

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

ఇప్పటికే రవాణా రంగం కుదేలవుతోంది. గిట్టుబాటు కాకున్నా ఈఎంఐలు కట్టేందుకై నా ట్రాక్టర్‌ నడపాల్సి వస్తోంది. ప్రస్తుతం పెరిగిన డీజిల్‌ ధరతో రవాణా ఖర్చు మరింత పెంచాల్సి వస్తోంది. రైతుల ధాన్యం, మక్కలను మార్కెట్‌కు తరలించాలంటే ఇంతకుముందు దూరాన్ని బట్టి రూ.1500 తీసుకునేది. ఇప్పుడు రూ.1700 తీసుకోవాల్సి వస్తోంది.

– రాజు, ట్రాక్టర్‌ యజమాని

ధరల స్థిరీకరణ ఉండాలి

ధరల స్థిరీకరణ ఉండేలా ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగగానే ఇతర రంగాలపై పెను భారం పడుతోంది. సదరు రంగాలపై పక్కాగా పర్యవేక్షణ చేసి ఽవినియోగదారులకు ప్రయోజనం కలిగేలా చూడాలి. ధరలు పెంచడం కాకుండా ప్రభుత్వాలు తీసుకునే ట్యాక్స్‌లు తగ్గించుకుంటే మంచిది.

– పత్తెం శ్రీనివాస్‌, ఉపాధ్యాయుడు

Advertisement
 
Advertisement
Advertisement