బస్టాండ్‌పై మరింత ‘నిఘా’ | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌పై మరింత ‘నిఘా’

Apr 2 2026 7:23 AM | Updated on Apr 2 2026 7:23 AM

● ఇటీవల వరుస బైక్‌ చోరీలు ● అప్రమత్తమైన పోలీసులు ● పార్కింగ్‌ ప్రాంతాల్లో మరో 10 కెమెరాలు ఏర్పాటు

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ బస్టాండ్‌లో బైక్‌ చోరీలతో దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు సీసీ కెమెరాల నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే బస్టాండ్‌ ఆవరణలో 42 సీసీ కెమెరాలు ఉండగా, పార్కింగ్‌ ప్రాంతాలు పూర్తిగా కవర్‌ కావడం లేదని గుర్తించిన పోలీస్‌ అధికారులు తాజాగా మరో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన రెండు బైక్‌ దొంగతనాలు స్థానికంగా కలకలం రేపాయి. ఓ చానల్‌ కెమెరామెన్‌ జన్నారం శ్రీనివాస్‌కు చెందిన బైక్‌తో పాటు, ధర్మారం ప్రాంతానికి చెందిన ఆకుల అక్షిత్‌ బైక్‌ను దొంగలు అపహరించారు. బస్టాండ్‌ మిడిల్‌ గేట్‌ వద్ద తమ వాహనాలను పార్క్‌ చేసి వెళ్లగా మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి అవి కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన బాధితులు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

ప్లాన్‌ ప్రకారమే చోరీలు..?

దొంగలు ప్లాన్‌ ప్రకారం చోరీ చేస్తున్నారా? లేక బ స్టాండ్‌ను టార్గెట్‌గా చేసుకున్న ముఠా ఉందా? అ న్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో బస్టాండ్‌ పరిసరాల్లో భద్రతా లోపాలు బ యటపడుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ పార్కింగ్‌ ప్రాంతాల్లో సరైన లైటింగ్‌, నిఘా లేక దొంగలకు అనుకూలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పో లీసులు మాత్రం ఇకపై బస్టాండ్‌ పరిధిలో ప్రతి మూలను సీసీ కెమెరాల నిఘాలోకి తీసుకురావా లని ఏసీపీ వెంటకస్వామి, సీఐ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో బుధవారం అదనంగా 10 కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు అదనంగా పహారా బలగాలను పెంచడం, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించడం వంటి చర్యలు చేపడుతున్నారు. బస్టాండ్‌ వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే చోరీలు జరుగుతుండటంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement