కరీంనగర్‌టౌన్: రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు మొత్తం చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఫెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, జాగృతి సంస్థ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తదితరులు మాట్లాడారు. 2024 మార్చి నన్చి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ అయిన 24,678 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీపీఎఫ్, టీఎస్ జీఎల్‌ఐ, జీఐఎస్ తదితర బకాయిలు అందక నానా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమౌళి, ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, బకాయిలు అందక, మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 250 మంది పెన్షనర్లు చనిపోయినారని అన్నారు. ఇప్పటికై నా బకాయిలు మొత్తం చెల్లించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సుంకిశాల ప్రభాకర్‌రావు, కనపర్తి దివాకర్ పాల్గొన్నారు.
పరిశోధన కేంద్రం
సందర్శన
కరీంనగర్‌సిటీ: నగరంలోని ఎస్సారార్ డిగ్రీ, పీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రం, వృక్షశాస్త్ర విభాగాన్ని మంగళవారం కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీ, లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విభాగాధిపతులు, అధ్యాపకులు సందర్శించా రు. వృక్షశాస్త్ర శాఖాధిపతి తిరుకోవేల శ్రీనివాస్ వారికి పరిశోధనల అంశాలు వివరించారు. కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు రాధాకృష్ణ, డాక్టర్ తిరుపతి, డాక్టర్ తాహిర్‌హుస్సేన్, డా.కళాజ్యోతి, డాక్టర్ తిరుపతి, డాక్టర్ స్వరూపరాణి, డాక్టర్ మొహమ్మద్ తాజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మున్నూరుకాపులు ఐక్యంగా ముందుకెళ్లాలి
కరీంనగర్: మున్నూరుకాపులను గ్రామస్థాయి నుంచి ఏకతాటిపై నడిపించేందుకు కృషి చేయాలని సంఘం గౌరవ అధ్యక్షుడు గంగుల సుధాకర్‌పటేల్ అన్నారు. మంగళవారం మంకమ్మతోటలో నిర్వహించిన రాష్ట్ర యువజన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. మున్నూరుకాపులు రాజకీయాలకతీతంగా ముందుకు సాగి అభివృద్ధి దిశలో పయనించాలన్నారు. సంఘం బాధ్యులు సత్తినేని శ్రీనివాస్, కూరగాయల తిరుపతి, వాసాల హరీశ్, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


