కరీంనగర్‌సిటీ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని శాతవాహన వీసీ డా.ఉమేశ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కాలేజీ జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ రామకృష్ణ అధ్యక్షతన పర్యావరణ పునరుద్ధరణ, వ్యవస్థలపై వాతావరణ మార్పుల ప్రభావాలను అంచనా వేయడం, వన్యప్రాణుల సంరక్షణ వ్యూహాలు అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈసందర్భంగా వీసీ హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని తాము యూనివర్సిటీలో చేస్తున్నటువంటి పర్యావరణ హిత కార్యక్రమాలను వివరించారు. జంతు శాస్త్ర విభాగాధిపతి జాతీయ సదస్సు కన్వీనర్ డాక్టర్ కిరణ్మయి, వైస్ ప్రిన్సిపాల్ టి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర పరిశోధనలు జరగాలి
వివిధ రకాల ఆహార పదార్థాలను సేకరించి నిల్వ చేసే విషయాలపై సమగ్రమైన పరిశోధనలు జరగాలని శాతవాహన వీసీ ఉమేశ్‌కుమార్ అన్నారు. విశ్వవిద్యాలయంలో డా.రమాకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆహార విశ్లేషణ పద్ధతులు అనే అంశంపై రెండు రోజుల సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ హాజరై మాట్లాడారు. విద్యార్థులు పరిశోధన పద్ధతులను నేర్చుకోవడమే ప్రధాన లక్ష్యమని వీటికి సదస్సులు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఫుడ్ సైన్స్ విభాగాధిపతి, కార్యశాల కన్వీనర్ డాక్టర్ జోసఫ్‌రాజు, అధ్యాపకులు డాక్టర్ హరిత, మస్రత్, సాయిప్రియ, డాక్టర్ సరసిజ, డాక్టర్ రాజు, డాక్టర్ కిరణ్, డాక్టర్ మధు, డా.అజయ్, డాక్టర్ రమేశ్‌రెడ్డి, డాక్టర్ నరసింహాచారి, డాక్టర్ మల్లారెడ్డి, శ్రీవిద్య పాల్గొన్నారు.


