● ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ ● స్వీకరించిన కలెక్టర్ చిత్రామిశ్రా ● పరిష్కారానికి ఆదేశం
కరీంనగర్ అర్బన్: ప్రజావాణి అర్జీలపై విచారణ జరిపి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తారని, ఫిర్యాదులపై ఆయాశాఖల అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మొత్తంగా ప్రజావాణికి 225 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, ఆర్డీవో కె.మహేశ్వర్, డీఆర్డీవో శ్రీధర్ అర్జీలను స్వీకరించారు.
ప్రజావాణికి వచ్చిన అర్జీలు: 225
మున్సిపల్ కార్పొరేషన్: 50
తిమ్మాపూర్ తహసీల్దార్: 15
కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 11
తహసీల్దార్ కొత్తపల్లి: 11
డీపీవో: 10, ఆర్డీవో కరీంనగర్: 09
ఆర్డీవో హుజూరాబాద్: 08


