కరీంనగర్‌క్రైం: జాతీయ, రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా శనివారం వివిధ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 4,077 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 106 సివిల్ కేసులు, 3,926 క్రిమినల్ కేసులు, 45 ప్రిలిటిగేషన్ కేసులు పరిష్కరించారు. సివిల్ కేసుల్లోని 86 మోటారు వాహనాల కేసుల్లో రూ.5,50,70,000 రూల నష్ట పరిహారం కక్షిదారులకు ఇన్సురెన్స్ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు చెల్లించడానికి అంగీకరించాయి. జిల్లా జడ్జి శివకుమార్ మాట్లాడుతూ రాజీయే రాజమార్గమని, రాజీతోనే ఇరువర్గాలకు మేలని తెలిపారు. లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం వల్ల డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు సిబ్బంది సహకారంతో చాలా మంది కక్షిదారులు స్వచ్ఛంధంగా ముందకు వచ్చి కేసులను పరిష్కారం చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. న్యాయమూర్తి రాణి, న్యాయవాదులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా 16వ స్థానంలో నిలిచింది.
జిల్లా జడ్జి శివకుమార్


