సైదాపూర్: వ్యవసాయ సహకార సంఘాలు రైతు ఆధారిత వ్యాపార రంగాల్లో రాణిస్తున్నాయని పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి ముంజాల శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని వెన్నంపల్లి, వెన్కెపల్లి సహకార సంఘాల వార్షిక మహాసభ ఆయా సంఘాల సీఈవోల అద్యక్షతన జరిగింది. సహకార సంఘాలు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే, వ్యాపార రంగాలు విస్తరించుకొని ఆర్థికంగా స్థిరపడుతున్నాయన్నారు. రైతులకు ఎరువులు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సింగిల్ విండో మాజీ చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి కోరారు. ఆరెపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం, ఎరువుల దుకాణం ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ ఆవునూరి పాపయ్య కోరారు. ఎగ్లాస్‌పూర్‌లో ఎరువుల కొరత రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి కోరారు. మహాసభలో సీఈవోలు మల్లారెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.


