డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో సమీక్ష | - | Sakshi
Sakshi News home page

డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో సమీక్ష

Mar 29 2026 7:05 AM | Updated on Mar 29 2026 7:05 AM

కరీంనగర్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్‌ వెంకటరమణ అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ మీటింగ్‌ హాల్లో శనివారం జిల్లా ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ విభాగాల శాఖల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 2025 నుంచి మార్చి 2026 వరకు ఉన్న టార్గెట్‌, అచీవ్‌మెంట్ల వివరాలు తెలుసుకున్నారు. హెచ్‌ఐవీ పరీక్షలు చేసి పేషెంట్లందరినీ ఏఆర్టీ సెంటర్‌కి పంపించి ఉచితంగా మందులు ఇప్పించాలని, గర్భిణులకు హెచ్‌ఐవీ, సిఫిలిసిస్‌ పరీక్షలు జరిపి ఎవరికై నా పాజిటివ్‌ వస్తే వారికి పుట్టబోయే బిడ్డకు సోకకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధ రాజేంద్ర పాల్గొన్నారు.

హెల్పింగ్‌ హ్యాండ్స్‌కు జాతీయ పురస్కారం

మానకొండూర్‌: మానకొండూర్‌ మండలంలోని గట్టుదుద్దెనపల్లిలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన సామాజిక సేవలకు గాను వైద్యుల గ్లోబల్‌ ఫౌండేషన్‌ వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో తెలంగాణ సేవారత్న జాతీయ పురస్కారం అందించింది. గ్రామంలోని 32 మంది యువకులు గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని ఎనిమిది సంవత్సరాలుగా సేవ కార్యక్రమాలు అందిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన వైద్యుల గ్లోబల్‌ ఫౌండేషన్‌ వసుంధర విజ్ఞాన వికాస మండలి తెలంగాణ సేవా రత్న జాతీయ పురస్కారం హెల్పింగ్‌ హ్యాండ్‌ సభ్యులకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అందించింది.

ఐదు టిప్పర్ల పట్టివేత

కొత్తపల్లి: కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని ఒడ్డెపల్లి వద్ద శనివారం రాత్రి అక్రమ మట్టి రవాణాకు పాల్పడుతున్న ఐదు టిప్పర్లను పట్టుకున్నట్లు కొత్తపల్లి ఎస్‌హెచ్‌వో, ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌ తెలిపారు. కొత్తపల్లి మండలం ఎలగందుల తదితర గ్రామాల నుంచి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్లతో పాటు డ్రైవర్లు సరయ్య, సూర మల్లేశం, శ్రీనివాస్‌, గంగాధర్‌, సి.రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement