కరీంనగర్ కల్చరల్: ‘సాక్షి’ జర్నలిస్టు గోలి కిరణ్‌కు రాష్ట్ర ఉత్తమ అగ్రికల్చర్ జర్నలిస్ట్ అవార్డు వరించింది. రైతుల సమస్యలు, వ్యవసాయ పథకాలు, తీరుతెన్నులపై వందల కథనాలు అందించారు. అతని సేవలను గుర్తించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అవార్డు ప్రకటించింది. శనివారం జరిగిన రైతు సదస్సు, అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్‌లో అవార్డు స్వీకరించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, కో–ఆర్డినేటర్ బోగారి హరికృష్ణ, కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ డీన్ రాంప్రసాద్, కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఆత్మ పీడీ ఛత్రునాయక్, పొలాస సీనియర్ సైంటిస్ సంధ్యాకిషోర్, సిరిసిల్ల కళాశాల అసోసియేషన్ డీన్ సునీత, నర్సింహరెడ్డి, ఏవోలు సురేందర్‌నాయక్, పున్నం చందర్ అభినందించారు.


