అమరవీరుల త్యాగాలతోనే స్వేచ్ఛ | - | Sakshi
Sakshi News home page

అమరవీరుల త్యాగాలతోనే స్వేచ్ఛ

Mar 24 2026 7:05 AM | Updated on Mar 24 2026 7:05 AM

● నగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

● నగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: అమరవీరుల త్యాగాల ఫలితంగానే దేశ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా క్యాంప్‌ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భగత్‌నగర్‌ చౌరస్తాలోని భగత్‌సింగ్‌ విగ్రహానికి పలువురు కార్పొరేటర్లతో కలిసి పూలమాల వేసి, అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత అమరవీరుల స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. కార్పొరేటర్లు మాసం గణేశ్‌, భారీ అపర్ణ, పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్‌, నాంపల్లి రేణుక శ్రీనివాస్‌, కొమురయ్య, పొన్నం లక్ష్మి మొండయ్య పాల్గొన్నారు.

సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు

సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఈ నెల 27న నగరంలోని నాలయాల్లో నగరపాలకసంస్థ తరఫున ఏర్పాట్లు చేయాలని మేయర్‌ శ్రీనివాస్‌ ఆదేశించారు. సోమవారం బల్దియా సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నగరంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆలయాల వద్ద వాటర్‌ ట్యాంకర్లతో తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. సహాయ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈ సంజీవ్‌కుమార్‌, ఎంహెచ్‌వో సుమన్‌, డీఈలు దేవేందర్‌, అరుణ్‌కుమార్‌, ఓంప్రకాష్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement