గ్రామస్తులు ఇబ్బంది పడకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

గ్రామస్తులు ఇబ్బంది పడకుండా చర్యలు

Mar 24 2026 7:05 AM | Updated on Mar 24 2026 7:05 AM

● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

మానకొండూర్‌: నేషనల్‌ హైవే– 563 నిర్మాణంలో ఈదులగట్టెపల్లి గ్రామస్తులు దారి విషయంలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చిత్రామిశ్రా పేర్కొన్నారు. మండలంలోని ఈదులగట్టెపల్లికి సర్వీస్‌రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు రోడ్డు పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ సర్వీస్‌ రోడ్డు స్థలాన్ని పరిశీలించారు. సర్వీస్‌ రోడ్డు నిర్మించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలన

ఇల్లందకుంట: మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం కలెక్టర్‌ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్‌, అశ్వినితాకాజీ వాకాడే పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేసి, జాతర విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌బాబు, ఏసీపీ మాధవి, తహసీల్దార్‌ భాస్కర్‌, ఎంపీడీవో రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement