పేషెంట్లతో జీజీహెచ్‌ కిటకిట | - | Sakshi
Sakshi News home page

పేషెంట్లతో జీజీహెచ్‌ కిటకిట

Mar 24 2026 7:05 AM | Updated on Mar 24 2026 7:05 AM

ఒక్కరోజే 1,406 మంది పేషెంట్లకు వైద్యం

కోల్‌సిటీ(రామగుండం): వరుసగా రెండురోజులపాటు సెలవులు రావడంతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌) సోమవారం పేషెంట్లతో రద్దీగా కనిపించింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతు ఆస్పత్రికి సుమారు 1,406 మంది తరలివచ్చారు. వీరిలో మహిళలు 814 మంది, పురుషులు 476 మంది ఉండగా, మిగిలిన వారు పిల్లలు, ఇతర విభాగాలకు చెందినవారు ఉన్నారు. ఓపీ రిజిస్ట్రేషన్‌ కోసం కౌంటర్ల వద్ద బారులు తీరారు. వైద్యులు, సిబ్బంది వారికి సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. సెలవులతో ముందుగా చికిత్స పొందలేకపోయిన వారు ఒకేసారి రావడంతో రద్దీ నెలకొందని తెలుస్తోంది. పేషెంట్ల రద్దీ ఉన్నా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రతీపేషెంట్‌కు ఓపిగ్గా వైద్య సేవలు అందించినట్లు ఆర్‌ఎంవో రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement