సుప్మా అధ్యక్షుడిగా జగన్‌గౌడ్‌ | - | Sakshi
Sakshi News home page

సుప్మా అధ్యక్షుడిగా జగన్‌గౌడ్‌

Mar 23 2026 8:51 AM | Updated on Mar 23 2026 8:51 AM

సిరిసిల్లటౌన్‌/సిరిసిల్ల ఎడ్యుకేషన్‌/కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీ ప్రైవేటు డిగ్రీ కాలేజ్‌ మేనేజ్మెంట్‌ అసోసియేషన్‌ (సుప్మా) నూతన అధ్యక్షుడిగా రాజన్న జిల్లాకు చెందిన గుగ్గిళ్ళ జగన్‌గౌడ్‌ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఆదివారం సుల్తానాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్‌కు చెందిన గోవిందవరం కృష్ణ, కోశాధికారి ధర్మపురికి చెందిన సంగోజు అంజయ్యను ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లాలో శాతవాహన పరిధిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్మా పూర్వ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, శ్రీపాద నరేశ్‌, కొలనూరు శేఖర్‌రెడ్డి నూతన ప్రతినిధులను సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement