అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఎన్‌హెచ్‌జీ మహిళా సంఘాల సభ్యులకు 32 రకాల వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఐదు మండలాల్లోని పీహెచ్‌సీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. షెడ్యూల్ రాగానే వైద్య పరీక్షలు ప్రారంభిస్తాం. రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున మహిళా సంఘాల సభ్యుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తాం. పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే దశల వారీగా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తాం.
– డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌వో


