శృంగేరి పీఠాదీశ్వర జయంతిలో కేంద్రమంత్రి సంజయ్‌ | - | Sakshi
Sakshi News home page

శృంగేరి పీఠాదీశ్వర జయంతిలో కేంద్రమంత్రి సంజయ్‌

Mar 23 2026 8:51 AM | Updated on Mar 23 2026 8:51 AM

కరీంనగర్‌: కర్ణాటకలోని శ్రీశ్రీశ్రీ శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి అనంత శ్రీ భారతీ తీర్థ మహాస్వామి 76వ జయంతి ఉత్సవాల్లో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమా ర్‌ పాల్గొన్నారు. శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ నిర్వహించిన పలు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శృంగేరి శారదాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. శృంగేరి పీఠ తెలంగాణ బాధ్యులు వ్యాసోజల రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు.

జల సంరక్షణకు పాటుపడాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌/విద్యానగర్‌/కరీంనగర్‌స్పోర్ట్స్‌: జలసంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మేయర్‌ కొలగాని శ్రీని వాస్‌ అన్నారు. ఆదివారం ప్రపంచ జల దినో త్సవం సందర్భంగా వైశ్యభవన్‌లో మానేరు పర్యావరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత వేసవికాలంలో భూగర్భ జలాలు అడుగంటి పోయే పరిస్థితి ఉందన్నారు. తాగునీరు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారన్నారు. వర్షాకాలంలో వాననీరు ఒడిసిపట్టుకోవాలనే ఆలోచన చేయకపోవడంతోనే ఇలాంటి పరిస్థి తి ఏర్పడుతోందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. శాతవా హనరోడ్డులోని వాకర్‌ అసోసియేషన్‌ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నా రు. మానేరు పర్యావరణ సమితి అధ్యక్షుడు తోట లక్ష్మణరావు, 66వ డివిజన్‌ కార్పొరేటర్‌ వంగల పవన్‌, సర్వోదయ అధ్యక్షుడు పెద్ది లక్ష్మీనారాయణ, స్వరాజ్యబాబు, నారా యణ, వెంకటేశం, సత్యనారాయణ పాల్గొన్నారు.

పుస్తక పఠనంతోనే జ్ఞాన సముపార్జన

కరీంనగర్‌టౌన్‌: వ్యక్తి విజయం జ్ఞానంతోనే సాధ్యమవుతుందని, జ్ఞానం నిరంతరం పుస్తకాలు చదవడం వల్ల వస్తుందని, అందరూ పుస్తకాలు చదవాలని స్వేరోస్‌ ఫౌండర్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆదివార కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఓ ఫంక్షన్‌ హాల్‌లో స్వేరోస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బుక్‌ రీడథాన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాడకంలోకి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిందన్నారు. ఆ టెక్నాలజీ పుస్తకాలు చదవడం వల్ల వచ్చిన జ్ఞానంతోనే సాధ్యమైందని మరిచిపోవద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరి చేత విక్టర్‌ ఈ ఫ్రాంకిల్‌ రచించిన అర్థం కోసం అన్వేషణ అనే పుస్తకాన్ని చదివించారు. స్వేరోస్‌ చీఫ్‌ కన్వీనర్‌ బల్గూరి దుర్గయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మనోజ్‌, బాబు నాయక్‌, జిల్లా అధ్యక్షుడు అనిల్‌, ఆకినపల్లి శిరీష, అజయ్‌ పాల్గొన్నారు.

పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి

కరీంనగర్‌స్పోర్ట్స్‌: రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని పెటా సంఘం అధ్యక్షుడు బాబు శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. ఆదివారం అంబేద్కర్‌ స్టేడియంలో జరిగిన పెటా సంఘం సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1,803 ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. 4,703 ఉన్నత పాఠశాలలకు 2,900 మంది పని చేస్తున్నట్లు తెలిపారు. వ్యాయామ విద్యను మూల్యాంక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని, ప్రాథమికస్థాయి నుంచి ఉన్నత విద్య వరకు తప్పకుండా వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు ఉండాలన్నారు. పెటా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్‌, కోశాధికారి డి.వీరపాల్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేటెడ్‌ ప్రెసిడెంట్‌ గిన్నె లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement