కరీంనగర్: మహిళల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు 32 రకాల వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఐదు పీహెచ్‌సీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో చిగురుమామిడి, చొప్పదండి, ఇల్లందకుంట, గంగాధర, కొత్తపల్లి మండలాల్లోని పీహెచ్‌సీల పరిధిలో మహిళలకు వైద్య పరీక్షలు చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 13 వేలకు పై చిలుకు మహిళా స్వయం సహాయక (ఎస్‌హెచ్‌జీ) సంఘాలుండగా, వాటిలో 1.04 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా సెర్ప్, డీఆర్డీవో శాఖల ఆధ్వర్యంలో సీ్త్ర నిధితో పాటు పావలా వడ్డీ.. తదితర రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ్యులందరికీ ఉచితంగా 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపిక చేయబడిన పీహెచ్‌సీల్లో రక్త నమూనా సేకరించి జిల్లాకేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపిస్తారు. ఏవైన వ్యాధులు ఉన్నట్లు తేలితే వారికి వెంటనే చికిత్స అందిస్తారు.
ప్రజా పాలనలో భాగంగా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనుంది. కుటుంబ ఆరోగ్యానికి మహిళల ఆరోగ్యం కీలకమనే భావనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన పీహెచ్‌సీల్లో మహిళల నుంచి రక్త నమూనాలు సేకరించి జిల్లాకేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపిస్తారు. ఇందులో భాగంగానే ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అవసరమైన 32 రకాల వైద్య పరీక్షలు చేయించేందుకు సర్కారు సిద్ధమైంది. పరీక్షల్లో ఏవైనా వ్యాధులు బయటపడితే వెంటనే చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీ ణ ప్రాంత మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడమే కాకుండా, ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుంది.


