భక్తిశ్రద్ధలతో రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో రంజాన్‌

Mar 22 2026 5:30 AM | Updated on Mar 22 2026 5:30 AM

సాలెహ్‌నగర్‌లో సందేశం వినిపిస్తున్న ముస్లిం మతపెద్ద

కరీంనగర్‌ కల్చరల్‌: రంజాన్‌ పండుగను శనివారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల ప్రసంగాలు విన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దానధర్మాలు ఆచరించారు. బంధు, మిత్రులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సాలెహ్‌నగర్‌ ఈద్గా వద్ద ముప్తీ ఘియాస్‌ మొహిముద్దీన్‌ దైవ సందేశం ఇచ్చారు. సీపీ గౌస్‌ ఆలం ప్రార్థనల్లో పాల్గొన్నారు. వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ఉన్న పురానీ (ఖదీమ్‌షాహి) ఈద్గా, చింతకుంట ఈద్గా, ఆయా గ్రామాల్లోని మసీదుల వద్ద ప్రార్థనలు చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు పర్యవేక్షించారు.

రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న చిన్నారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement