● కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్: రాష్ట్రంలో మందుల కొనుగోలు సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్‌లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. మెడిసిన్ కొనుగోలుకు పేదలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నరేంద్రమోడీ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు తెరిచి చౌక ధరకే మెడిసిన్ అందిసున్నారన్నారు. మేయర్ శ్రీనివాస్ ఉన్నారు.
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పోస్టర్లను మంత్రి పొన్నంప్రభాకర్ శనివా రం ఆవిష్కరించారు. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు మంత్రిని శాలువాతో సత్కరించారు. ఇన్‌చార్జి ఈవో సుధాకర్, ధర్మకర్తలు పరమేశ్, నారాయణరెడ్డి, రాజేందర్, మల్లేశ్, రామ్‌రెడ్డి, నగేశ్ పాల్గొన్నారు.
వెండి ఆభరణాలు అందజేత
శ్రీస్వామివారికి హుజూరాబాద్‌కు చెందిన కోరె ం నరసింహరెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య శ్రీదే వి, కుటుంబసభ్యులు హరీశ్, ప్రతాప్ రెడ్డి, హిరెన్ రూ.21 లక్షల విలువైన 7.64 కిలోల వెండి ఆభరణాలు ఆలయానికి అందజేశారు.
నూనె గింజల సాగుపై దృష్టి పెట్టాలి
చిగురుమామిడి: రైతులు వరి కన్నా నూనె గింజలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల పంటలపై దృష్టిసారించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ హెడ్ ప్రొఫెసర్ హరికృష్ణ కోరారు. శనివారం చిగురుమామిడి మండలం ముదిమానిక్యం గ్రామంలో ఎరువుల వినియోగం– నూనె గింజల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధిక మోతాదులో ఎరువులు వాడి నేలను కలుషితం చేయవద్దని సూచించారు. పంట మార్పిడి ద్వారా దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. సర్పంచ్ బోయిని రమేశ్ మాట్లాడుతూ రైతులు పంట వైవిద్యీకరణ, నేల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. ఏవో పున్నం చందర్, ఏఈవో ఆకుల ప్రణయ్, ఉపసర్పంచ్ పూదరి పర్శరాములు పాల్గొన్నారు.
విద్యారంగానికి నిధులు కేటాయించాలి
కరీంనగర్ టౌన్: రాష్ట్ర బడ్జెట్‌ను సవరించి విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు శనివారం బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలు విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. తక్షణమే బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు సందేశ్, మానస, సన్నీ, నరేశ్, నగేశ్, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, సహాయ కార్యదర్శులు అశోక్, అరవింద్ పాల్గొన్నారు.


