బీమా.. | - | Sakshi
Sakshi News home page

బీమా..

Mar 21 2026 5:00 AM | Updated on Mar 21 2026 5:00 AM

శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026 ప్లాస్లిక్‌ కవర్ల కొరత డీఈఈసెట్‌ విడుదల పాత ప్రాజెక్టులపై రాని స్పష్టత

న్యూస్‌రీల్‌

కుటుంబాల బీమాకు పెద్దపీట

అల్పాహారంతో 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి

వరద కాలువకు రూ.249 కోట్లు, ఎల్లంపల్లికి రూ.449 కోట్లు

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీకి రూ.250 కోట్లు

శాతవాహన యూనివర్సిటీకి రూ.25 కోట్లు

కొత్తపల్లి– మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ నిధులపై రాని స్పష్టత

నిజాం షుగర్స్‌, పత్తిపాక, కల్వలపై వెలువడని ప్రకటన

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు మోదం.. ఖేదం

కరీంనగర్‌
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026
అల్పాహారం!

I

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. కూరగాయలు, నిత్యావసరాలకు వాడే పాలిథిన్‌ కవర్లు మార్కెట్‌లో అందుబాటులో లేవు. ప్రజలు బట్ట సంచులతో వస్తున్నారు.

IIలోu

తెలంగాణలో ప్రభుత్వ డైట్‌, ప్రైవేట్‌ కళాశాలల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ డిప్లొమా, ప్రీ– స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిప్లొమాలో 2026–27లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు నోటిఫికేషన్‌న్‌ విడుదల అయ్యింది.

IIలోu

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: 2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యార్థులు, పేదలకు పెద్దపీట వేసింది. అల్పాహారం, కుటుంబ బీమాలతో ఉమ్మడి జిల్లాలో లక్షలాదిమంది లబ్ధిదారులుగా మారనున్నారు. అల్పాహారం పథకంతో 2.01లక్షల మంది పాఠశాల విద్యార్థులు, 33 వేల మందికిపైగా ఇంటర్‌ విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. పథకం సమర్థంగా అమలు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో వరదకాలువకు రూ.249 కోట్లు, ఎల్లంపల్లికి రూ.449 కోట్లు చొప్పున కేటాయించింది. ఉమ్మడి జిల్లా నీటిపారుదలకు దాదాపు రూ.700 కోట్లు కేటాయించింది. శాతవాహన వర్సిటీకి ఏకంగా రూ.25 కోట్లు, ఏడాది జరగనున్న పుష్కరాలకు రూ.500 కోట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని ఽగోదావరి తీరాన ఉన్న ధర్మపురి, కోటిలింగాల, గోదావరిఖని, మంథని ఘాట్లలో సదుపాయాలు కల్పనకు త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.

హైదరాబాద్‌– కరీంనగర్‌ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి– మనోహరాబాద్‌ రైల్వే లైన్‌కు ఎంత నిధులు ఇచ్చారన్నది స్పష్టం చేయలేదు. జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్‌ప్లాన్‌ కోసం వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీటీడీఏ)కు నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్‌పై ప్రకటన, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement