ఫ్లడ్ ఫ్లో కెనాల్ రూ.249.85 కోట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూ.449.66 కోట్లు బొక్కలవాగు రూ.34 లక్షలు గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు (మొత్తం రాష్ట్రానికి) శాతవాహన యూనివర్సిటీ రూ.25 కోట్లు టీఎస్ స్పోర్ట్స్ స్కూల్ వరంగల్ అండ్ కరీంనగర్ రూ.42.80 కోట్లు కరీంనగర్ స్మార్ట్ సిటీ రూ.250 కోట్లు
ప్రజా వంచన
కరీంనగర్: రాష్ట్ర బడ్జెట్ ప్రజా వంచనగా ఉంది. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాలు లేవు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా, లక్ష కోట్ల రూపాయల అప్పు భారాన్ని మోపేందుకు సిద్ధపడ్డారు. రైతు భరోసా ఎగ్గొట్టారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఎలాంటి సాయం అందలేదు. మహిళలకు హామీ ఇచ్చిన పథకాలు, వృద్ధులకు పెన్షన్ పెంపు అంశాన్ని విస్మరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగింది. మైనారిటీలకు అధిక కేటాయించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
– బండి సంజయ్‌కుమార్,
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూపొందించిన 2026–27 బడ్జెట్ సమగ్రాభివద్ధికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించిన సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యాలను ప్రతిబింబించే బడ్జెట్. – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడీలా ఉంది. ప్రభుత్వం చెప్పే దానికి చేసే దానికి పొంతన లేదు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు బుట్ట దాఖలు అయ్యాయి. ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు లేవు. అంకెల గారడి నీటి మూటలు దగాకోరు బడ్జెట్ ఇది. ప్రభుత్వ పతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
– గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే
ప్రతీ కుటుంబానికి
రూ.5లక్షల జీవిత బీమా
ప్రస్తుతం 41 లక్షల
కుటుంబాలు
(2011 ప్రకారం..
37 లక్షలు)
ఇందిరమ్మ బీమా పొందే
కుటుంబాలు:
8,00,000
ఉమ్మడి జిల్లాకు
కనీస అంచనా
రూ.400 కోట్లు


