హుజూరాబాద్: రాష్ట్ర బడ్జెట్ అంకెలా గారడీలా ఉంది. సామాన్యులకు లబ్ధి ఏం లేదు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సరైన నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ నిర్ణయాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభుత్వం పణంగా పెడుతోంది. రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఎలాంటి ఆశాజనకమైన కేటాయింపులు లేవు. అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం విస్మరించింది. సామాన్యుడికి మిగిలేది శూన్యం.
– కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే


