కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 1000 రోజులు కావస్తున్నా.. ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేకపోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీలు, కాంగ్రెస్ హామీల వైఫల్యాన్ని ఎండగడుతూ బీజేపీ రాష్ట్రశాఖ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టి, అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామని మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 1000 రోజులు గడిచినా ఇచ్చిన హామీ నిలుపుకోలేన్నారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నాయకులు సంగప్ప, వై.సునీల్ రావు, గుగ్గిలపు రమేశ్, ఈ.నాగేశ్వర్‌రెడ్డి, వాసాల రమేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.


