64 కళల్లో మేజిక్ ఒక అద్భుతం
64 కళలలో అద్భుత, ప్రధానమైన కళ ఇంద్రజాలం. మంత్రాలు, మాయలలనే భావన నుంచి మ్యాజిక్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. వినోదంతోపాటు విజ్ఞానం కూడా అందిస్తూ మూఢనమ్మకాల నిర్మూలనలో తనవంతు పాత్ర పోషిస్తుంది. శాసీ్త్రయ ఆలోచనలు కలిగిస్తుంది. ఒకప్పుడు మ్యాజిక్ నేర్చుకోవాలి అంటే అంత సులభం అయ్యేది కాదు. మెజీషియన్లు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండేవాళ్లు కాదు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా మ్యాజిక్ అందుబాటులో ఉంటుంది. మెజీషియన్లు కూడా చాలా మంది యువకులు తయారు అవుతున్నారు.
– ఎస్.మల్లేశం, మేజిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు


