ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

Feb 23 2026 6:57 AM | Updated on Feb 23 2026 6:57 AM

ట్రాక

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ఇద్దరు పిల్లల వైద్యానికి చేసిన అప్పులు తీర్చలేక.. సరైన ఉపాధి లేక మనోవేదనకు గురైన ఓ డ్రైవర్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్సై అబ్దుల్‌ ఘనీ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌కు చెందిన అనమేని ఆంజనేయులు(42) కూతురు సహస్ర అనారోగ్యానికి గురికాగా అప్పు చేసి చికిత్స చేయించాడు. కుమారుడు చరణ్‌ సైతం అనారోగ్యానికి గురికాగా మరిన్ని అప్పులు చేసి కొడుకును కాపాడుకున్నాడు. ఈక్రమంలోనే వ్యవసాయ కూలీగా పనిచేసే ఆంజనేయులు మరోసారి అప్పు చేసి ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు. అది కూడా సరిగా నడవకపోవడంతో.. హైదరాబాద్‌ వెళ్లి డ్రైవర్‌గా పనిచేశాడు. సరైన జీతం లేక రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన ఆంజనేయులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఉరివేసుకున్నారు. దాదాపు రూ.10లక్షల వరకు అప్పులు ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకుని ఒకరు..

మల్యాల: మానసికవేదనతో ఒకరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బల్వంతాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్‌ కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోను బక్కయ్య (53) కొంతకాలంగా మానసిక వేదనతో బాధపడుతున్నాడు. పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన ఆదివారం ఉదయం బల్వంతాపూర్‌ శివారులో హార్వెస్టర్‌కు ఉరేసుకున్నాడు. బక్కయ్య భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

పంచాయతీ కార్మికుడు..

ముత్తారం(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ధర్యపూర్‌ గ్రామ పంచాయతీ మల్టీపుల్‌ పంచాయతీ సిబ్బంది చంద మొగిలి(43) శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దికాలం క్రితం మతిస్థిమితి కోల్పోయాడని, ఈక్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్‌ తెలిపారు. ధర్యపూర్‌, హరిపురంలో మల్టీపుల్‌ పంచాయతీ వర్కర్‌గా పనిచేసిన మొగిలి చనిపోవడంతో సర్పంచులు రాపెల్లి రాజయ్య, మెంగని సమత, గ్రామస్తులు సంతాపం ప్రకటించారు.

మస్కట్‌లో బొమ్మెన వాసి మృతి

కథలాపూర్‌: మండలంలోని బొమ్మెన గ్రామానికి చెందిన లోలపు శ్రీనివాస్‌(40) మస్కట్‌లో అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. శ్రీనివాస్‌ ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం మస్కట్‌ వెళ్లాడు. అక్కడ అనారోగ్యం బారిన పడడంతో తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ మూడు రోజుల క్రితం మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య1
1/2

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య2
2/2

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement