టుడే న్యూస్ పేపర్.. టుమారో బెస్ట్ పేపర్!
సాక్షి కథనాలు.. విద్యార్థులకు పాఠాలు నాణేలు, కరెన్సీ వివరాల బోధన పిల్లలకు మార్గదర్శనం చేస్తున్న పెద్ది శ్రీనివాస్ విద్యార్థిగా మొదలైన అలవాటు టీచర్‌గా కొనసాగింపు
నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ అంటారు.. కానీ, జగిత్యాలలోని గోవిందపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెద్ది శ్రీనివాస్ న్యూస్ పేపర్ కూడా టీచింగ్ టూల్ అని గట్టిగా నమ్ముతారు. జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లిలో పనిచేస్తున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో వచ్చే విజ్ఞానదాయకమైన సమాచారం, శీర్షికలను కత్తిరించి ల్యామినేషన్ చేసి పుస్తకాలుగా మలచి గ్రంథాలయంలో భద్రపరుస్తున్నారు. వాటిలోని అంశాలను విద్యార్థులకు బోధించి విజ్ఞానం పెంపొందింపజేస్తున్నారు. పాఠ్యపుస్తకాలకు తాజా సమాచారాన్ని జోడించి పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచేలా కృషి చేస్తున్నారు. – సాక్షి,కరీంనగర్ డెస్క్ 8లోu


