పుట్టమన్ను తెచ్చి.. అంకురార్పణ చేసి
కరీంనగర్‌కల్చరల్: నగరంలోని మార్కెట్‌రోడ్డు వేంకటేశ్వరాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ వైభవంగా జరిగింది. ఉదయం పాతబజార్ గౌరీశంకరాలయం నుంచి పుట్టమన్ను తెచ్చారు. సాయంత్రం విశ్వక్‌సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం జరిగాయి. రాత్రి శ్రీవారు శేషవాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, ఆలయ ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, గంగాధర్, ఈవో కందుల సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
పుట్టమన్ను తెచ్చి.. అంకురార్పణ చేసి
పుట్టమన్ను తెచ్చి.. అంకురార్పణ చేసి


