మహాధర్నాకు తరలిరావాలి
పెద్దపల్లి: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 23న నిర్వహించే ఓిసీల మహాధర్నాకు రాజకీయాలకతీతంగా తరలిరావాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కోరారు. శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి ధర్నాకు సంబంధించిన కరపత్రం అందజేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షల్లో వయోపరిమితి పెంచాలన్నారు.


