జీవనశైలిలో మార్పురావాలి
ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావాలి. లేకుంటే చిన్నవయస్సులోనే జబ్బులకు గురికావాల్సి వస్తుంది. పూర్వం 70–80 ఏళ్ల వయస్సు వారికి కూడా షుగర్, బీపీ రాలేదు. అప్పుడు హార్డ్‌వర్క్‌తో పాటు, సమయానికి తిని పడుకునేవారు. ప్రస్తుత జనరేషన్ లేట్‌నైట్‌లు, పబ్బులు ఇలా.. గడపడంతో 30 ఏళ్లు రాకముందే రోగాలబారిన పడుతున్నారు. చిన్నపిల్లలకు మొబైల్ అలవాటు కావడం, ఆల్కహాల్, ఉప్పు అధికంగా తినడం రోగాలకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. దీంతోనే గుండెజబ్బులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా, వాకింగ్ చేయాలి. అప్పుడే ఆరోగ్యకరంగా ఉంటారు.
– డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, ఫిజిషియన్


