జీవితంపై నమ్మకం పోయింది..
● సూసైడ్‌నోట్ రాసి యువకుడి ఆత్మహత్య
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ షిర్కే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న జూపాక అనిల్(28) శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనిల్‌కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య, తను, తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నాడు. ఇటీవల సింగరేణి వర్క్‌షాప్‌లో అప్రెంటిషిప్ పూర్తిచేశాడు. అయితే, కుటుంబ కలహాలతోనే జీవితంపై విరక్తి చెంది క్షణికావేశానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై తనకు నమ్మకం పోయిందని, తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని సూసైడ్‌నోట్ రాసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రసాద్‌రావు తెలిపారు.
మానసిక వేదనతో ఒకరు..
మానకొండూర్: మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పెద్దపేట శంకరాచారి(58) అనే వ్యక్తి తేజాబ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ సంజీవ్ వివరాల ప్రకారం.. శంకరాచారి తన కులవృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కుమారులను డిగ్రీ వరకు చదివించాడు. కుమారులకు ఉద్యోగం రాలేదని రోజూ బాధపడుతుండేవాడు. కొంతమందికి శంకరాచారి అప్పులిచ్చాడు. వారు తిరిగి చెల్లించకపోవడం, కుమారులకు జాబ్ రాకపోవడంతో మానసిక వేదనకు గురై శనివారం ఇంట్లోని తేజాబ్ తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తాటిచెట్టు పైనుంచి పడి మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన గీతకార్మికుడు బూరుగు సదయ్య (45) శనివారం తాటిచెట్టు ఎక్కుతుండగా జారి కిందఉన్న వరిపొలంలో పడి ఊపిరాడక మరణించాడని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. సమీపంలోని సహచర గీతకార్మికులు వెంటనే బయటకు తీసినా అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సదయ్య కుటుంబీకులకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గీతపారిశ్రామిక సంఘ నాయకులు కోరారు.
విద్యుత్ వైర్ల దొంగలు అరెస్ట్
జగిత్యాలరూరల్: జగిత్యాల శివారులోని హస్నాబాద్, ఉప్పరిపేట, చల్‌గల్‌లో వ్యవసాయ బావుల విద్యుత్ మోటార్లు దొంగిలిస్తున్న ఐదుగురు మహిళలను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. శనివారం వివరాలు వెల్లడించారు. హస్నాబాద్‌కు చెందిన రైతు బత్తుల శ్రీధర్ వ్యవసాయ మోటారును, అలాగే విద్యుత్ వైర్లు, 10 క్వింటాళ్ల ధాన్యాన్ని దొంగిలించారని రైతులు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై సదాకర్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. చిన్న కెనాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం తనుగుల గ్రామానికి చెందిన బత్తుల సారవ్వ, గంట రాజవ్వ, బత్తుల సమ్మవ్వ, బత్తుల మంజుల, బత్తుల సారవ్వను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరం అంగీకరించారు. వీరి నుంచి ధాన్యం, కాపర్ వైర్లు విక్రయించగా వచ్చిన రూ.62,500 స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
జీవితంపై నమ్మకం పోయింది..
జీవితంపై నమ్మకం పోయింది..


