విద్యుత్ అధికారుల ‘ప్రజాబాట’
కొత్తపల్లి(కరీంనగర్)/తిమ్మాపూర్: విద్యుత్ విని యోగదారులకు మరింత చేరువయ్యేందుకు ‘ప్రజాబాట’ కార్యక్రమం మొదలైంది. వారంలో మూడు రోజుల పాటు ‘ప్రజాబాట’ కార్యక్రమానికి మంగళవారం టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళ, గురు, శనివారాల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ టౌన్–2 సెక్షన్ పరిధిలో నిర్వహించిన ప్రజాబాటను చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్)బి.అశోక్ ప్రారంభించారు. తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట, తిమ్మాపూర్, గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తిమ్మాపూర్ ఆటోస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే ఓ ఇంటి వద్ద ఉన్న ఇనుప కరెంటు పోలును పరిశీలించి స్తంభం మారుస్తామని తెలిపా రు. ఎస్‌ఈ రమేశ్‌బాబు, డీఈ రాజం, సర్పంచ్‌లు అంజనేయులు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.


