భీమేశ్వరా శరణు..శరణు
వేములవాడ: సమ్మక్క జాతర సమీపిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం రాజన్న సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం రాత్రంతా దర్శనాలు కొనసాగినా సోమ, మంగళవారాలు సైతం భక్తుల రద్దీ కొనసాగింది. రాజన్న గుడి నుంచి మొదలుకుని బద్దిపోచమ్మ, భీమన్న ఆలయాల వరకు దారిపొడవునా భక్తుల రద్దీ కనిపించింది. రాజన్న గుడి వద్ద ప్రచారరథంలో రాజన్నను, భీమేశ్వరుని ఆలయంలో కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల ఏర్పాట్లను ఏఈవోలు శ్రవణ్, అశోక్ పరిశీలించారు.


