మట్టి అక్రమ రవాణాపై పోలీస్ పంజా
చందుర్తి(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్ల పేరిట అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం మూడు ట్రాక్టర్లను పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ‘సాక్షి’లో ఈనెల 5న ‘తగ్గేదెలే.. తవ్వుడే’ శీర్షికన ప్రచురితమైన కథనంపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించారు. చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు మట్టి తరలించేందుకు రెవెన్యూ అధికారులు 8 ట్రాక్టర్లకు అనుమతినిచ్చారు. అదనంగా అనుమతి లేని మరో ఏడు మొత్తం 15 ట్రాక్టర్లలో మట్టి తరలిస్తుండగా పోలీసులు వచ్చారన్న సమాచారంతో నాలుగు ట్రాక్టర్ల డ్రైవర్లు పంట చేల నుంచి వాహనాలతో తప్పించుకోగా, మరో మూడు అనుమతి లేని ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. సదరు ట్రాక్టర్లు కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందినవారివని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మట్టి అక్రమ రవాణాపై పోలీస్ పంజా


