వేధిస్తున్న వైద్యుల కొరత
ఖాళీలు భర్తీచేస్తాం
గోదావరిఖని: వైద్యులు, వైద్య నిపుణులు, వైద్యసిబ్బంది కొరత సింగరేణి ఆస్పత్రులను వేధిస్తోంది. ప్రధానంగా కార్మికులకు ఆశించిన స్థాయిలో వైద్యసేవలు అందకుండా చేస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు యాజమాన్యం ఈనెల 8, 9వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇందుకోసం అన్నిఏర్పాట్లు చేస్తోంది.
టెక్నీషియన్ల కొరత కూడా..
సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యులతోపాటు టెక్నీషియన్ల కొరత వెంటాడుతోంది. రూ.కోట్లు వెచ్చించి యంత్రాలు కొనుగోలు చేసినా.. వినియోగించేందుకు టెక్నీషియన్లు అందుబాటు లేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సకాలంలో వైద్యపరీక్షలు చేయక ఇటీవల పురిట్లోనే ఓ పాప చనిపోవడం వివాదాస్పదమైంది.
వైద్యం కోసం ఏటా రూ.140 కోట్లు
సింగరేణి ఉద్యోగుల వైద్యం కోసం ఏటా సుమారు రూ.140కోట్లు వ్యయం చేస్తోంది. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం రూ.100 కోట్లు కేటాయిస్తోంది. మందుల కోసం రూ.40కోట్ల ఖర్చు చేస్తోంది.
32 మంది వైద్యుల నియామకానికి సన్నద్ధం
వివిధ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి ఈనెల 8, 9వ తేదీల్లో యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ప్రధానంగా నలుగురు జనరల్ సర్జన్, ఏడుగురు గైనకాలజిస్ట్‌లు, నలుగురు పిల్లల వైద్యనిపుణులు, ముగ్గురు చెస్ట్ ఫిజీషియన్‌లు, ఇద్దరు ఈఎన్‌టీ సర్జన్, ఏడుగురు అనస్తీయా, ఒక పాథలాజిస్ట్, ఒక ఫిజియాలజిస్ట్, ముగ్గురు హెల్త్ ఆఫీసర్లను భర్తీచేయనుంది.
సిబ్బంది పరిస్థితి కూడా అంతే..
సింగరేణి ఆస్పత్రుల్లో దుస్థితి
32 మంది డాక్టర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
8, 9వ తేదీల్లో ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు
ఈనెల 8, 9తేదీల్లో
భర్తీచేయనున్న పోస్టులు
జనరల్ సర్జన్ 4
గైనకాలజిస్ట్ 7
పిల్లలవైద్యనిపుణులు 4
చెస్ట్ ఫిజీషియన్ 3
ఈఎన్‌టీ సర్జన్ 2
అనస్తీషియా 7
పాథలాజిస్ట్ 1
ఫిజియాలజిస్ట్ 1
హెల్త్ ఆఫీసర్లు 3
ఆస్పత్రులు, అందుబాటులోని వైద్యులు, సిబ్బంది
మెయిన్ –కొత్తగూడెం 1
ఏరియా 7
డిస్పెన్సరీలు 21
మొత్తం పడకలు 821
వైద్యులు 180
స్పెషలిస్ట్‌లు 57
మెడికల్ ఆఫీసర్లు 123
వైద్యసిబ్బంది 1,120
వైద్య సేవలు పొందుతున్న ఉద్యోగులు
పర్మినెంట్ 40,000
కాంట్రాక్ట్ 25,000
రిటైర్డ్ 1,60,000
రెఫరల్ ఆస్పత్రులు 180
సింగరేణి, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులకు అత్యాధునిక వైద్యసేవలు అందిస్తాం. ఇందుకోసం ఈనెల 8, 9వ తేదీల్లో 32 మంది డాక్టర్లను భర్తీచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. త్వరలోనే రామగుండం సింగరేణి ఏరియా ఆస్పత్రిలో గుండె సంబంధిత క్యాత్‌ల్యాబ్ ప్రారంభిస్తాం.
– కిరణ్‌రాజ్‌కుమార్, సీఎంవో, సింగరేణి


