ఎవరికి చెప్పాలి?.. ఎలా చెప్పాలి? | - | Sakshi
Sakshi News home page

ఎవరికి చెప్పాలి?.. ఎలా చెప్పాలి?

Jan 7 2026 7:29 AM | Updated on Jan 7 2026 7:29 AM

ఎవరికి చెప్పాలి?.. ఎలా చెప్పాలి?

ఎవరికి చెప్పాలి?.. ఎలా చెప్పాలి?

బోయినపల్లి(చొప్పదండి): కొత్తగా ఎన్నికై న సర్పంచులు గ్రామ సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదని పేర్కొంటున్నారు. గతంలో మండల పరిషత్‌ పాలకవర్గం ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అపుడు మండల సభలలో సర్పంచులు తమ గ్రామ సమస్యలు అధికారులకు తెలిపేవారు. దీంతో అధికారులకు సర్పంచులకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు లేక మండల సభలు జరగడం లేదు. గత డిసెంబర్‌లో కొత్తగా ఎన్నికై న సర్పంచులు తమ గ్రామ సమస్యలు ఎలా తెలుపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలలకోసారి మండల సభలు

గతంలో మండల పరిషత్‌ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతీ మూడు నెలలకోసారి మండల సర్వ సభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచులు హాజరు అయ్యేవారు. డివిజన్‌ స్థాయి అధికారులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు అయ్యేవారు. అలాగే మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ అధికారి తమ శాఖ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయ, విద్యా, విద్యుత్‌, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్‌, పీఆర్‌ ఇంజినీరింగ్‌, ఆర్‌డబ్లూఎస్‌ ఇంజినీరింగ్‌, ఐకేపీ, ఉపాధిహామీ, పశుసంవర్దక, రెవెన్యూ ఇలా 11 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు. ఈ సమయంలో శాఖల వారి అధికారులు తమ నివేదిక చదివినపుడు ఆయా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అధికారులు వివరించేవారు. దీంతో గ్రామ సర్పంచులకు, మండల అధికారులకు మధ్య మంచి సంబందాలు ఏర్పడేవి. డివిజన్‌ స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకు పోయిన సమస్యల పరిశ్కారానికి మండల సభలు వేదికలు అయ్యేవి.

గ్రామాల సమస్యలు ఎలా తెలపాలి?

గడువు ముగిసిన వెంటనే గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారంది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్‌ నెలలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీ రహదారులు, మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచులు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. మండల సభ ఏర్పాటు చేస్తే అధికారులకు, సర్పంచులకు మధ్య ర్యాపో ఏర్పడుతుందని అంటున్నారు.

సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని కొత్త సర్పంచుల ఆవేదన

గతంలో మూడు నెలలకోసారి మండల సభలు

ఇప్పుడు మండల పరిషత్‌ పాలక వర్గాలు లేవు.. మండల సభలు లేవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement