బావిలోపడి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బావిలోపడి మహిళ మృతి

Jan 7 2026 7:29 AM | Updated on Jan 7 2026 7:29 AM

బావిలోపడి మహిళ మృతి

బావిలోపడి మహిళ మృతి

బావిలోపడి మహిళ మృతి రోడ్డు ప్రమాదంలో హమాలీ.. ముంబయిలో తెలంగాణ ఉద్యమ నేత మృతి భార్యపై హత్యాయత్నం

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన లక్ష్మి(57) దావన్నపల్లి గ్రామ ంలోని వ్యవసాయ బావిలో జారిపడి మృతి చెందిందని రూరల్‌ ఎస్సై మల్లేశ్‌ తెలిపారు. కొంత కాలంగా మానసిక స్థితి సరిగ్గాలేని లక్ష్మి.. ఇంటినుంచి ఉదయం బయల్దేరి, అటుగా వెళ్లి జారి బావిలో పడి మరణించిందన్నారు. మృతురాలి కుమారుడు సతీశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు.

మానకొండూర్‌: మానకొండూర్‌ మండలం సదాశివపల్లి రైస్‌మిల్లులో హమాలీగా పనిచేస్తున్న అల్లం రాజయ్య(56) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సీఐ సంజీవ్‌ వివరాల ప్రకారం.. మానకొండూర్‌ గ్రామానికి చెందిన అల్లం రాజయ్య సదాశివపల్లిలోని ఉమా రైస్‌మిల్లులో హమాలీగా పనిచేస్తున్నాడు. ఉదయం రైస్‌మిల్లు వద్ద బైక్‌పై వెళ్తూ రోడ్డు దాటుతుండగా, కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న ట్రాలీ మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో 108లో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మలిదశ తెలంగాణ ఉద్యమ నేత.. తెలంగాణ సాధనకు ముంబయిలో తెలుగువారి ని ఒక్కటి చేసిన ఉద్యమ నాయకుడు బద్ది హేమంత్‌ సోమవారం మృతి చెందాడు. ముంబయి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా, తెలంగాణ లింక్‌ అనే తెలుగు వారపత్రికను నడిపిన హేమంత్‌ అక్కడ అనేక బహుజన, కార్మిక సంఘాల ఉద్యమాలకు నాయకత్వం వహించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకుడిగా అక్కడ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. హేమంత్‌ కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కోకిలాబెన్‌ ఆసుపత్రిలో మృతిచెందారు. మంగళవారం అతడి భౌతికకాయానికి బౌద్ధ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు జరిపి, అంత్యక్రియలు నిర్వహించినట్లు బహుజన సాహిత్య అకాడమీ మహారాష్ట్ర అధ్యక్షుడు నాగెల్ల దేవానంద్‌ తెలి పారు. హేమంత్‌కు నివాళి అర్పించిన వారిలో ముంబయి బీఆర్‌ఎస్‌ నాయకులు బొల్లె శివరా జ్‌, దొనకొండ సంతోష్‌, నాగ్‌సేన్‌, తెలంగాణ సే వాసంస్థ నవీ ముంబయి అధ్యక్షుడు వెలుగు లింగయ్య, సైదులు, కొమురయ్య, లక్ష్మణ్‌, కృష్ణ, పున్నం వెంకన్న, పరమేశ్‌ తదితరులున్నారు.

గోదావరిఖని: కుటుంబ కలహాలతో నేపథ్యంలో పుట్టింటికి వచ్చిన ఆరునెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త మంగళవారం దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. గోదావరిఖని వన్‌టౌన్‌ ఎస్సై రమేశ్‌ కథనం ప్రకారం.. నగరంలోని మేదరిబస్తీకి చెందిన బచ్చల కావేరికి కమలాపూర్‌ మండలం బీంపల్లి గ్రామానికి చెందిన బచ్చల చంద్రమౌళితో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు రావడంతో పదిరోజుల కిందట కావేరి పుట్టింటికి వచ్చింది. ఇదేక్రమంలో అత్తగారింటికి చేరుకున్న చంద్రమౌళి.. మాటామాట పెరిగి తన భార్య కావేరిపై కత్తితో దాడిచేశాడు. తల, ఎడమ చెవి, కుడి చెయ్యి, కుడి చెవి ప్రాంతంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను గోదావరిఖని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement