ఇసుక విక్రయించి.. సొమ్ముచేసుకుంటున్నారు..
మానేరులో బారులు తీరిన ఇసుక ట్రాక్టర్లు
గట్టెపల్లి మానేరు తీరంలో ఇసుక నిల్వలు
సాండ్ టాక్సీ పాలసీని తొలగించి.. ఇంటి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక వాడుకోవాలని పాలకులు, అధికారులు సూచించారు. ఇసుక పాలసీని స్థానికులకు ఉచితం చేస్తే.. దూర ప్రాంతాలకు చేరవేస్తూ ఇసుక విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ట్రాక్టర్ల యజమానులు. సుల్తానాబాద్, పెద్దపల్లి, ధర్మారం, బసంత్‌నగర్, కమాన్‌పూర్ వరకు మానేరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు ఇసుకాసురులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల, కదంబాపూర్, గట్టెపల్లి.. ఇలా మానేరుతీరంలో వందలాది ట్రాక్టర్లు నిత్యం ఇసుక తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
ఇసుక విక్రయించి.. సొమ్ముచేసుకుంటున్నారు..


