ఆవేదనలు.. నివేదనలు
కరీంనగర్ అర్బన్: నెలల తరబడి ప్రజావాణి చు ట్టూ తిరుగుతున్నాం. పట్టించుకున్న నాథుడే లేడు. మండలంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ ఆఫీస్‌కు వస్తే ఇక్కడా అంతే.. చూస్తాం.. చేస్తామనడమే త ప్ప చర్యలు లేవంటూ బాధితులు గగ్గోలు పెట్టా రు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలకు విముక్తి కల్పించాలని వేడుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పలు సమస్యలపై ఆరా తీశారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 299 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురితో ‘సాక్షి’ మాట్లాడగా తమ బాధను వెల్ల గక్కారు. వివరాలు వారి మాటల్లోనే..
మొత్తం అర్జీలు: 299
కరీంనగర్ కార్పొరేషన్: 68
హౌసింగ్: 43, ఇతర శాఖలకు: 188


