రోడ్లు, డ్రైనేజీల సమస్యలకు శాశ్వత పరిష్కారం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని 21వ డివిజన్ విద్యానగర్‌లో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, 11వ డివిజన్ రామచంద్రాపూర్‌లో రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిపోయిన అన్ని పనులు త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు బోనాల శ్రీనివాస్, వరాల నర్సింగం, చేవెళ్ల మల్లికార్జున్, ఊరడి లత, వెన్నం రజితారెడ్డి, మిర్యాల శ్రీధర్‌రెడ్డి, గుడిపాటి రమణారెడ్డి, తాళ్లపల్లి మహేశ్‌గౌడ్, భూపతి జగన్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, సుతారి శ్రీనివాస్, నాగరాజు, అనిత, స్వప్న, కవిత తదితరులు పాల్గొన్నారు.


