అపెరల్‌ పార్క్‌.. నిర్లక్ష్యపు మార్క్‌ ! | - | Sakshi
Sakshi News home page

అపెరల్‌ పార్క్‌.. నిర్లక్ష్యపు మార్క్‌ !

Jan 6 2026 2:01 PM | Updated on Jan 6 2026 2:01 PM

అపెరల

అపెరల్‌ పార్క్‌.. నిర్లక్ష్యపు మార్క్‌ !

సిరిసిల్ల: పాలకులు మారినప్పుడల్లా అభివృద్ధి స్వరూపం మారిపోతుంటుంది. అభివృద్ధి.. సంక్షేమ ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఫలితంగా సిరిసిల్ల నేతకార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించే ‘వర్కర్‌ టు ఓనర్‌’ పథకం మూలనపడింది. కార్మికులను యజమానులుగా మార్చే ఈ స్కీమ్‌ అప్రధాన్యతగా మారింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, అప్పటి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు నేతకార్మికుల జీవితాలలో మార్పు తెచ్చేందుకు వర్కర్‌ టు ఓనర్‌ పథకాన్ని రూపొందించారు. 2017 అక్టోబరు 11న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శంకుస్థాపన చేయించారు. రూ.374 కోట్ల భారీ బడ్జెట్‌తో దేశంలోనే తొలిసారిగా వీవర్స్‌పార్క్‌కు శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో శ్రీవర్కర్‌ టు ఓనర్‌శ్రీ పథకం రెండేళ్లుగా మూలనపడింది. ఫలితంగా సిరిసిల్లలోని నేతకార్మికులు ఇప్పటికీ ఓనర్టు కాలేకపోయారు.

25 వేల మంది కార్మికులు.. 48 షెడ్లు

సిరిసిల్లలో 25వేల మంది కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. నేత కార్మికుడే యజమానిగా మారి సొంత సాంచాలపై పనిచేసి మెరుగైన ఉపాధి పొందేందుకు 48 షెడ్లు నిర్మించారు. రాష్ట్ర పరిశ్రమల, మౌళిక వసతుల కల్పన సంస్థ(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో వీవర్స్‌పార్క్‌ నిర్మాణమైంది. 2023లోనే ఇక్కడ మౌళిక వసతులు రోడ్లు, వీధిదీపాలు, మురికి కాల్వలు, ప్రహరీ పనులు పూర్తయ్యాయి. ప్రయోగాత్మకంగా రెండు సెమీ ఆటోమేటిక్‌ లూమ్స్‌ను, మరో స్పన్‌వైండింగ్‌ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒకేసారి నాలుగు రంగుల నూలుతో అనేక డిజైన్లతో వస్త్రాన్ని ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

జారీ కాని మార్గదర్శకాలు

‘వర్కర్‌ టు ఓనర్‌’ పథకానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ కాలేదు. తొలి విడతగా 1,104 మంది పేదకార్మికులను ఎంపిక చేస్తామని 2023లో అధికారులు ప్రకటించారు. ఒక్క కార్మికుడికి రెండు సెమీ ఆటోమేటిక్‌, మరో రెండు జకార్డ్‌ లూమ్స్‌, ఒక్క స్పన్‌ వైండింగ్‌ మిషన్‌ ఇస్తారు. ఒక్కో షెడ్డులో 96 లూమ్స్‌, 24 స్పన్‌వైండింగ్‌ మిషన్స్‌ను అమర్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఆ లూమ్స్‌ను కొనుగోలు చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక విధానం ప్రకటించకపోవడంతో సిరిసిల్ల నేతన్నల్లో నిరాశ నెలకొంది. తొలుత ఎంపికై న కార్మికులు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం చెల్లిస్తే.. 50 శాతం ప్రభుత్వ రాయితీ, మరో 40 శాతం బ్యాంకు రుణం అందించేలా ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేశారు. ‘వర్కర్‌ టు ఓనర్‌’ అమలులోకి వస్తే సిరిసిల్ల నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. పథకం అమలుకు బీఆర్‌ఎస్‌ పోరాట మార్గాన్ని ఎంచుకుని మహాధర్నాకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సిరిసిల్ల పట్టణంలోని నేతన్నలతో ఆందోళనకు సిద్ధమైంది.

కార్మికుడు.. ఆసామి అయ్యేనా

‘వర్కర్‌ టు ఓనర్‌’ పథకంపై నేతన్నల ఆశలు

సంక్రాంతిలోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న కేటీఆర్‌

మార్గదర్శకాల ఊసే లేదు.. మగ్గాల జాడ లేదు

రూ.374 కోట్లతో 88.03 ఎకరాల్లో వీవింగ్‌ పార్క్‌

ఇదీ పథకం స్వరూపం

స్థలం: పెద్దూరు వద్ద 88.03 ఎకరాలు

నిధులు: రూ.373 కోట్లు

ఖర్చు చేసినవి : రూ.210 కోట్లు

మొత్తం వర్క్‌ షెడ్లు: 48

పూర్తయినవి: 40

వార్పిన్‌ షెడ్లు: 04

తొలి విడతగా లబ్ధిపొందే కార్మికులు : 1104

ఆధునిక మరమగ్గాలు : 4416

మగ్గాల కొనుగోలుకు కావాల్సిన నిధులు: రూ.300 కోట్లు

ఇప్పటికి బిగించిన లూమ్స్‌: 04

అపెరల్‌ పార్క్‌.. నిర్లక్ష్యపు మార్క్‌ !1
1/2

అపెరల్‌ పార్క్‌.. నిర్లక్ష్యపు మార్క్‌ !

అపెరల్‌ పార్క్‌.. నిర్లక్ష్యపు మార్క్‌ !2
2/2

అపెరల్‌ పార్క్‌.. నిర్లక్ష్యపు మార్క్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement