బెల్ట్ షాపులు నిషేధం.. తిరగబడిన నిర్వాహకులు
వెల్గటూర్: బెల్ట్‌షాపులు వద్దన్నందుకు సర్పంచ్‌పైకే నిర్వాహకులు ఎదురుతిరిగిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబర్‌పేటలో సోమవారం చోటుచేసుకుంది. ఇటీవలి ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించిన దర్శనాల నరేశ్.. గ్రామంలో బెల్ట్ షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై నిర్వాహకుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీర్మానించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని నిర్వాహకులకు సూచించారు. నిర్ణయానికి వ్యతిరేకంగా బెల్ట్‌షాప్ నిర్వహిస్తే మొదటిసారి రూ.20 వేలు, రెండోసారి రూ.30వేలు, మూడోసారి రూ.50 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఈ తీర్మానంపై గ్రామంలోని బెల్ట్‌షాప్ నిర్వాహకులు తిరగబడ్డారు. ఎవరినడిగి ఏకపక్షంగా నిర్ణయాలు చేశారంటూ సర్పంచ్‌పైనే మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి మందు పంపిణీ చేయవచ్చుగానీ.. ఇప్పుడు గ్రామంలో మద్యనిషేధం అంటూ బెల్ట్‌షాపులను నిషేధిస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్‌షాప్‌లు మూసివేస్తే కిరాణ దుకాణాలూ మూసేస్తామని తెలి పా రు. ఈ విషయంలో బెల్ట్‌షాప్ నిర్వాహకులు, పంచాయతీ పాలకవర్గానికి మ ధ్య వాగ్వాదం జరిగింది. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవవరకూ కిరాణషాపులు తెరిచేది లేదంటూ నిర్వాహకులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.


