ఆనందం.. విషాదం | - | Sakshi
Sakshi News home page

ఆనందం.. విషాదం

Nov 13 2025 7:50 AM | Updated on Nov 13 2025 7:50 AM

ఆనందం.. విషాదం

ఆనందం.. విషాదం

పుట్టిన రోజే యువకుడి ఆత్మహత్య

బహ్రెయిన్‌లో ఘటన.. శోకసంద్రంలో కుటుంబం

జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఓ యువకుడు.. పుట్టినరోజునాడు అక్కడే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టాకాసందికి చెందిన అనుమండ్ల కల్యాణ్‌ (26) 10 నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లాడు. అక్కడ కారు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. వేతనం సరిపోకపోవడంతో వేరే పనిచేయడానికి మధ్యవర్తికి వీసా కోసం డబ్బులు చెల్లించా డు. సదరు వ్యక్తి వీసా ఇవ్వకుండా మోసం చేయడంతో కొన్ని రోజులుగా మనస్తాపం చెందుతున్నా డు. మంగళవారం ఆయన పుట్టినరోజు కావడంతో ఇక్కడి కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఆనందంగా గడిపాడు. అర్ధరాత్రి సమయంలో ఉరి వేసుకుని చనిపోయాడని అతని రూమ్‌లో ఉన్న వారు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పటివరకు తమతో మాట్లాడిన కల్యాణ్‌ ఆత్మహత్య చేసుకోవడమేంటని, ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement