టెక్‌ హఫీజ్‌ | - | Sakshi
Sakshi News home page

టెక్‌ హఫీజ్‌

Nov 2 2025 9:24 AM | Updated on Nov 2 2025 9:24 AM

టెక్‌ హఫీజ్‌

టెక్‌ హఫీజ్‌

మరింత మందిని తయారుచేస్తా

గోదావరిఖని(రామగుండం): రోజూ రూ.వందతో మొదలైన యూట్యూబర్‌ జీవితం నేడు నెలకు రూ.2లక్షల నుంచి 3లక్షల వరకు సంపాధిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు. సింగరేణి కార్మికుని బిడ్డగా ఈప్రాంత వాసులను టెక్నాలజీలో అనేక అంశాల్లో చైతన్యవంతం చేస్తున్నాడు. సెల్‌ఫోన్‌లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ముందుగా యైటింక్లయిన్‌కాలనీలో కంప్యూటర్‌ సెంటర్‌ నడిపించిన హఫీజ్‌ను యూట్యూబ్‌ ఉన్నత శిఖరాలకు చేర్చింది. ప్రస్తుతం ఎన్టీపీసీలో ఉంటూ TELUGU TECH TUTS యూట్యూబ్‌ చానెల్‌ నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించి యూఏఈ గోల్డెన్‌వీసా అందుకున్నాడు.

చిన్ననాటి నుంచి ఆసక్తి

చిన్నప్పటి నుంచి కంప్యూటర్‌పై పట్టున్న హఫీజ్‌ మొబైల్‌, కంప్యూటర్‌ గాడ్జెట్ల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చేవాడు. మొదట ఇంగ్లిష్‌ టెక్‌ యూట్యూబర్ల వీడియోలు చూస్తూ పట్టు సాధించాడు. 2011లో శ్రీతెలుగు టెక్‌ ట్యూట్‌శ్రీ యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాడు. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతోనే వీడియోలు తీయడం ప్రారంభించాడు. హఫీజ్‌ వీడియోలకు కావలిసినంత వీక్షకులు లేకపోయినా, స్నేహితులు కొందరు ఇదెవరు చూస్తారని ఎగతాలి చేశారు.

పట్టుదల, క్రమశిక్షణ

హఫీజ్‌ క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూ వచ్చారు. మొబైల్‌ రివ్యూలు, కొత్త యాప్స్‌ పరిచయం, ఆన్‌లైన్‌ సంపాదన మార్గాలు, సెక్యూరిటీ ట్రిక్స్‌ తదితర విషయాలను వీక్షకులకు వివరించాడు. తెలుగులో లక్ష మంది సబ్‌స్క్రైబర్స్‌, వన్‌ మిలియన్‌ వ్యూస్‌ సాధించిన టెక్‌ చానల్‌గా రికార్డుకెక్కింది. 2018లో సోషల్‌ మీడియా సమ్మిట్‌ అవార్డు, 2019లో టాప్‌ తెలుగు క్రియేటర్స్‌ జాబితాలో చోటు దక్కింది. 2022లో ఫోర్బ్స్‌ ఇండియా డిజిటల్‌ స్టార్‌ లిస్ట్‌లో చోటు సాధించగా, బెస్ట్‌ తెలుగు టెక్‌క్రియేటర్‌ అవార్డు వరించింది. యూట్యూబ్‌ కాకుండా బ్రాండ్‌ డీల్స్‌, స్పాన్సర్షిప్స్‌, యాప్‌ ప్రమోషన్స్‌ ద్వారా ప్రతినెలా రూ.2 లక్షల నుంచి 3లక్షల ఆదాయం వస్తోంది. హఫీజ్‌ కృషిని గుర్తించిన యూఏఈ ప్రభుత్వం గోల్డెన్‌ వీసా అందించింది. పదేళ్ల పాటు యూఏఈలో కుటుంబ సభ్యులతో సహా జీవించే అవకాశం ఉంటుంది.

టెక్‌, యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ముందుకు రావాలనుకునే యువతకు గైడెన్స్‌ ఇవ్వాలని ఉంది. యువతకు ఉచిత వర్క్‌షాప్‌లు, ఆన్‌లైన్‌ గైడెన్స్‌ ప్రోగ్రామ్‌లు, స్మార్ట్‌ డిజిటల్‌ కెరీర్‌ మార్గాలు చూపించాలనుకుంటున్న.

– సయ్యద్‌ హఫీజ్‌, తెలుగు టెక్‌ట్యూట్‌ క్రియేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement