
ఉరేసుకుని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
హుజూరాబాద్: హుజూరా బాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న మోరె రిషి(20)శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రిషి జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. ఏదో విషయంలో మానస్తాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మధ్యాహ్నం చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. వ్యక్తి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని, పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే జగిత్యాల పోలీసులను సంప్రదించాలని సూచించారు.
రామడుగు: తాగునీటి సమస్యను పరిష్కరించాలని రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ పరిధిలోని పదోవార్డు ప్రజలు శనివారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. పంచాయతీ కార్యాలయం గేటుకు తాళం వేసి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నప్పటికీ, తమ కాలనీకి సరఫరా చేయడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీవో శ్రావణ్‌కుమార్ గ్రామస్తులతో మాట్లాడి, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు.
మల్యాల: తన తండ్రిని తిడుతున్నాడని ఓ మైనర్ ఒకరిపై కత్తితో దాడి చేసిన సంఘటన మల్యాల మండలం రాజారాం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నరేష్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామంలో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన బక్కశెట్టి రాకేశ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి బక్కశెట్టి తిరుపతి ఇంటి ఎదుట కూర్చొని ఇరువురు మాట్లాడుకుంటున్నారు. ఆ చర్చ వాదనగా మారింది. రాకేశ్ తన తండ్రిని తిడుతున్నాడని తిరుపతి కుమారుడు ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి రాకేశ్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ను 108లో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి నానమ్మ బక్కశెట్టి బూదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉరేసుకుని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య

ఉరేసుకుని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య