
ఉత్సవాలను ఏటా నిర్వహిస్తాం
పూర్వీకులు నుంచి దండారీ ఉత్సవాల నిర్వహణకు కృషి చేస్తున్నాం. ఈ ఉత్సవాలను దీపావళి సందర్భంగా ఏటా ఘనంగా నిర్వహిస్తాం. వారంపాటు ఉపవాస దీక్షలతో పూజలు చేస్తాం. వచ్చినవారికి సదుపాయాలు కల్పిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నాం. – భీంరాావ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు,
జగన్నాథ్‌పూర్
దండారి ఉత్సవాల సందర్భంగా గిరిజనుల్లో సమైక్యత పెంపొందుతుంది. మా గ్రామానికి నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి దండారి ఉత్సవాల కోసం వారం రోజుల పాటు రావడంతో ఐక్యత పెరగడంతోపాటు వివాహ బంధాలకు వేదికగా మారుతుంది.
– సిడెం భీం, మాజీ సర్పంచ్, జగన్నాథ్‌పూర్
దీపావళి అంటేనే గిరిజనుల్లో దండారీ గుర్తుకువస్తుంది. వారంపాటు పండగ వాతావరణం నెలకొంటుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి గిరిజనులు మా గ్రామానికి రావడంతోపాటు మేం కూడా తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లి దండారి ఉత్సవాల్లో పాల్గొంటాం.
– ఆత్రం భీర్‌సాబ్, గ్రామ నాయకుడు

ఉత్సవాలను ఏటా నిర్వహిస్తాం

ఉత్సవాలను ఏటా నిర్వహిస్తాం