
సంజీవ్ కుటుంబానికి అండగా ఉంటాం
జూలపల్లి(పెద్దపల్లి): హైదరాబాద్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ గండు సంజీవ్(50) స్వగ్రామం కాచాపూర్‌లో శనివారం నిర్వహించారు. జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ సొంత పనుల కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడే గుండెపోటుకు గురవడంతో వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పార్థివదేహాన్ని స్వగ్రామం కాచాపూర్ తీసుకొచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తదితరులు కాచాపూర్ చేరుకని పార్థివ దేహానికి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతిమయాత్ర సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌కుమార్ పాడే మోశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, ధూళికట్ట పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు, సుల్తానాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రకాశ్‌రావు, మాజీ సర్పంచులు నర్సింహయాదవ్, ఆడప లక్ష్మణ్, బంటు ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు హాజరయ్యారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
కాచాపూర్‌లో ఏఎంసీ చైర్మన్ అంత్యక్రియలు
పాడె మోసిన మంత్రి లక్ష్మణ్‌కుమార్
హాజరైన ఎమ్మెల్యే విజయరమణారావు

సంజీవ్ కుటుంబానికి అండగా ఉంటాం