
రాజన్న ఆలయ పరిసరాల్లోనే దర్శనం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: భీమన్న గుడిలో కాదు.. రాజన్న ఆలయ పరిసరాల్లోనే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్, దేవాదాయశాఖ అధికారులతో సోమవారం ఈ విషయంపై చర్చించారు. కోడెమొక్కుల చెల్లింపు అనాదిగా వస్తున్న ఆచారమని, భక్తుల మనోభావాలకు విరుద్ధంగా రాజన్న ఆలయానికి బదులు భీమన్న ఆలయాన్ని అంగీకరించేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే 30 వేల మంది బీజేపీ కార్యకర్తలతో 15 రోజులపాటు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మేడారం జాతర దృష్ట్యా, రాజన్న భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బండి సంజయ్ సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారని, అవసరమైతే ఎల్‌ఈడీ స్క్రీన్, తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని సిరిసిల్ల డీపీఆర్వో కార్యాలయం ప్రకటన జారీ చేసింది.
నా భూమి లాక్కుంటారా?
కరీంనగర్ అర్బన్: దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో అధికారులు దౌర్జన్యంగా ఖనీళ్లు పాతారంటూ సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. కోర్టు స్టే ఉండగా ఎలా సర్వే చేస్తారని కలెక్టర్ పమేలా సత్పతి ఎదుట కంటతడి పెట్టా డు. చొప్పదండి మండలం కొలిమికుంట శివా రులోని సర్వే నంబర్ 307/ఎ/3/1లో ఏడు గుంటల భూమి గోస్కుల కొమురయ్య పేరున ఉంది. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. కోర్టును ఆశ్రయించగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, అవేవీ పట్టించుకోకుండా పంటను ధ్వంసం చేశారని కొమురయ్య వాపోయాడు. తహసీల్దార్, సర్వేయర్‌లు అక్రమార్కులకు అండగా నిలుస్తుండగా, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. ఈ క్రమంలో తహసీల్దార్ నవీన్, రైతు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
పార్క్ స్థలం పరిశీలన
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ముకరంపురలో వివాదాస్పద పార్క్ స్థలాన్ని సోమవారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. ‘కబ్జాలపై కదలికేది!’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించారు. ముకరంపురలోని స్థలం వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించారు. ఈ స్థలం తనదేనంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా, స్థలయజమాని పక్షాన ఆదేశాలు జారీ అయ్యాయని డీసీపీ బషీర్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయ న్యాయ విభాగం సలహాల మేరకు తగిన చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.
కరీంనగర్: కేబుల్ బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలు ఉండటంతో ఇప్పటి వరకు 15 రోడ్డు ప్రమదాలు జరిగాయని, ముగ్గురు చనిపోయారని, వెంటనే కేబుల్ బ్రిడ్జిపైన రోడ్డు వేయాలని ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రోడ్డు వేయాలని ధర్నా నిర్వహించారు. ఆవుల ఆది త్య, సాయిఅనురాగ్, ఆనంద్, శ్రవణ్, పవన్, రఽఘు, సాయికిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్‌స్పోర్ట్స్: ఆసిఫాబాద్ జిల్లా గోలేటి టౌన్‌షిప్‌లో ఈనెల 10నుంచి 12వరకు జరిగిన 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సెపక్ తక్రా పోటీల్లో జిల్లా క్రీడాకారులు నాలుగు పతకాలు సాధించారని జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గన్ను విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. క్రీడాకారులను జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు కన్న కృష్ణ, డీవైఎస్‌వో శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ బా ధ్యులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి అభినందించారు.

రాజన్న ఆలయ పరిసరాల్లోనే దర్శనం

రాజన్న ఆలయ పరిసరాల్లోనే దర్శనం