
ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల సమ్మె
కరీంనగర్: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గిట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ, ఆర్టీసీనీ ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం మోటార్ వాహన సవరణ చట్టం తీసుకొచ్చి ందని, దీనిలో భాగంగానే ఆర్టీసీ జేబీఎంను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంతో కార్మికులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లను అనవసరంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆందోళన కార్యక్రమాలు చేయకూడదని ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు పుల్లెల మల్లయ్య, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సత్యపాల్, జిల్లా అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.